భారతదేశం, జూలై 29 -- Karishma Tanna: ఈరోజు అంటే జులై 29 గురు పౌర్ణమి పవిత్ర పర్వదినాన బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా ఇంట సరికొత్త వెలుగులు విరబూశాయి. తన భర్త వరుణ్ బంగేరాతో (Varun Bangera) కలసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కరిష్మా ఒక ఎమోషనల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఆ పిక్‌లో పాపాయి చిన్న పాదాలు కనిపిస్తూ, 'హి ఈజ్ హియర్' (He's Here) అని రాసి ఉన్న ట్యాగ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. "ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మా జీవితంలోకి అతిపెద్ద బ్లెస్సింగ్ వచ్చింది. జులై 29, 2026న మా చిన్ని ప్రపంచంలోకి నీకు స్వాగతం" అంటూ ఆనందంతో ...