Hyderabad, ఆగస్టు 17 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అక్టోబర్ నెలలో అతిపెద్ద రాశి మార్పు చోటు చేసుకోనుంది. దేవతల గురువు, దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడంతో అనేక శుభయోగాలు ఏర్పడతాయి.

గురువు వేగంగా కదులుతాడు. గురువు రాశి మార్పు చెందడంతో చాలా రాశుల వారికి కలిసిరాబోతోంది. కర్కాటక రాశిలో గురువు సంచారం ఏ రాశిపై కూడా ప్రభావం చూపుతుందా? మీకు కూడా శుభఫలితాలు ఎదురవుతాయా? మరి, ఇప్పుడే తెలుసుకోండి.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గురువు చంద్రుని రాశిలో ఉన్నప్పుడు శుభఫలితాలు ఎదురవుతాయి. గురువు-చంద్రుడు స్నేహితులు. గురువు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి మ...