భారతదేశం, మే 18 -- గ్రహాలకు కదలికలు మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది. నవగ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇతర గ్రహాలతో కలిసినప్పుడు రకరకాల యోగాలు ఏర్పడడాన్ని చూస్తూ ఉంటాం.

ప్రస్తుతం దేవగురువు బృహస్పతి, గురువు శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఇద్దరు గురువులతో మనోకారకుడైన చంద్రుడు కూడా సంయోగం చెందబోతున్నాడు. ఒకే రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక శక్తివంతమైన త్రిగ్రాహి యోగాన్ని తీసుకొచ్చింది. మూడు రోజుల పాటు ఈ యోగం వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందబోతున్నారు.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా మే 18, 19, 20 తేదీల్లో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఈ మూడు రోజులు కూడా మిథున రాశిల...