భారతదేశం, మే 6 -- మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం చేసే ప్రయత్నాల్లో ఏది అత్యంత ప్రభావవంతమైనది? రెడ్ వైన్ తాగితే గుండెకు మంచిదా? వ్యాయామం కంటే నిద్ర గొప్పదా? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమిచ్చారు ప్రముఖ కార్డియోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్.

సుమారు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ జెరెమీ, ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన 'దిస్ ఆర్ దట్' (This or That) ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిద్ర, ఆహారం, సప్లిమెంట్స్, వ్యాయామం వంటి వివిధ అంశాలను విశ్లేషించి, గుండె ఆరోగ్యానికి ఏది 'రాజమార్గం' అనే విషయాన్ని స్పష్టం చేశారు.

సాధారణంగా రెడ్ వైన్ తాగితే గుండెకు మంచిదని చాలామంది నమ్ముతుంటారు....