Hyderabad, జూలై 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌కు వెళ్లిన రవి అక్కడున్న వెయిటర్స్ రూమ్‌లో ఉంటాను తోటి చెఫ్‌కు చెబుతాడు. మరోవైపు ఇంట్లో ప్రభావతి కోపంగా ఉంటే చూసి సత్యం, బాలు భయపడి సైలెంట్‌గా వెళ్లి భోజనం చేస్తారు. మీనా వెళ్లి పిలిస్తే ప్రభావతి రాదు.

సత్యం వచ్చి బతిమిలాడి తీసుకెళ్తాడు సత్యం. అందరి ముందు మా పరువు పోయింది. ఇంకా నయం రోహిణి వాళ్ల నాన్న రాలేదు. ఆయన ముందు కూడా పరువు పోయేదని ప్రభావతి అంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చిందే అని రోహిణి అనుకుంటుంది. దొరికింది పార్లరమ్మా అని బాలు మరింత ఇరికిస్తాడు. మీ నాన్న ఎక్కడ రోహిణి అని ప్రభావతి అడుగుతుంది.

ఇంట్లో అంతా రోహిణిని తన తండ్రి గురించి అడుగుతారు. దాంతో వాంతి వచ్చినట్లు వెళ్లి వాంతి చేసుకుంటుంది రోహిణి. వికారంగా ఉందా, పుల్లపుల్లగా తినాలనిపిస్...