Hyderabad, ఆగస్టు 11 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు (ఆగస్టు 11) అంటే 485వ ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ లో కల్పనకు షాక్ తగులుతుంది. మనోజ్, రోహిణిల వైపే ఎస్ఐ మాట్లాడతాడు. దీంతో కల్పన డబ్బు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుంది. అటు బాలు, మీనా కూడా తమ బండి కోసం పోలీస్ స్టేషన్ లోనే ఉండాల్సి వస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ తన బాధను చెప్పుకునే సీన్ తో మొదలువుతుంది. కల్పన తన రూ.40 లక్షలను మింగేసిందని చెప్పడానికి తన దగ్గర సాక్ష్యం ఉందంటూ జాయింట్ అకౌంట్ నుంచి ఆమె అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడాన్ని చూపిస్తాడు. దీంతో కల్పన రివర్స్ అవుతుంది. వీడే నన్ను ప్రేమించానంటూ మోసం చేశాడని అంటుంది. నా మొహం చూసి చెప్పండి నేను మోసం చేసేవాడిలా ఉన్నానా అని ఎస్ఐతో అంటాడు మనోజ్.

తన తండ్రి రిటైర్మెంట్ డబ్బు తీసుక...