Hyderabad, అక్టోబర్ 6 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా పుట్టింటికి బాల్ కాల్ చేసి అడిగితే.. అక్క అక్కడ లేదని సుమతి చెబుతుంది. మా అక్క అక్కడ ఎందుకు లేదు అని సుమతి అంటుంది. పూలు ఇవ్వడానికి వెళ్లింది. ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది అందుకే నీకు చేశా అని బాలు అంటాడు. బావ నిజం చెప్పు. ఏమైనా గొడవ జరిగిందా అని సుమతి అడుగుతుంది.

మీ అక్క గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తను గడప దాటేది కాదు. నువ్వు కంగారుపడి మీ అమ్మను కంగారుపెట్టకు అని బాలు ఫోన్ కట్ చేస్తాడు. సుమతి మాట్లాడంగా విన్న పార్వతి వచ్చి అడుగుతుంది. ఇంతలో శివ వస్తాడు. అక్క ఇంట్లో లేదట. ఇక్కడికి వచ్చిందేమో అని కాల్ చేశాడు అని సుమతి అంటుంది. వాడే ఏదో చేసి ఉంటాడు అక్కని. మందు కొట్టి ఏదో చేసి ఉంటాడు అని శివ అంటాడు.

మరోవైపు సత్యం ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. హడ...