భారతదేశం, అక్టోబర్ 31 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 544వ ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి ఇంట్లో వాళ్లకు అడ్డంగా దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీనా నగలు తాకట్టు పెట్టమంటే మనోజ్ వాటిని ఏకంగా అమ్మేయడంతో ఇంట్లో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 31) ఎపిసోడ్ బాలు కోసం మీనా చేపలు తెచ్చే సీన్ తో మొదలవుతుంది. కాళ్లు నొప్పులు పెడుతున్నాయన్న బాలు ఆమె వచ్చినప్పుడు మళ్లీ కారు తుడుస్తుండటంతో మీనా అతన్ని తిడుతుంది.

గది కోసం ఆలోచిస్తే తనకు నిద్ర పట్టడం లేదని బాలు అంటాడు. మీకు చేపలు పులుసు, వేపుడు చేస్తానని మీనా అంటుంది. అలాగే ముక్కతోపాటు చుక్క కూడా తెచ్చుకుంటానని బాలు అంటాడు. సరే నాకు ఓకే కానీ మామయ్యని అడిగి చెబుతానని అనడంతో వద్దని బాలు ఆమె వెంటపడతాడు.

సరిగ...