Hyderabad, జూలై 30 -- స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు 477వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్లో వ్యాపారం పోయిందని మీనా బాధపడటం, బాలు కొత్త బిజినెస్ ఐడియాతో రావడం, ఎపిసోడ్ చివర్లో ఓ అమ్మాయి పెళ్లి కోసం బాలు రౌడీయిజం చేయడంలాంటివి చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జులై 30) ఎపిసోడ్ బాధపడుతూ కూర్చున్న మీనాను బాలు బుజ్జగించే సీన్ తో మొదలైంది. తన పూలకొట్టు పోయినందుకు ఏడుస్తున్న మీనాను బాలు ఓదారుస్తాడు. కష్టాన్నే నమ్ముకున్న మనకు ఇదేమీ కొత్త కాదని అంటాడు. తన చిన్నతనంలోనే అమ్మ నాన్నమ్మ దగ్గరకు పంపిందని, ఆ తర్వాత జైలుకు కూడా పంపిందని అంటాడు.

ఇంటికి తిరిగి రావడానికి పెద్ద యుద్ధమే చేశానని, అయితే ఎలాగోలా ఇంటికి వచ్చినా అందరిలాగా అమ్మ ప్రేమను పొందలేకపోయానని బాలు చెబుతాడు. ఇంట్లో గుర్తింపు రావాలంటే తాను ఏదో ప...