Hyderabad, ఆగస్టు 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 497వ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. బిజినెస్ పెట్టడం కంటే ముందే మనోజ్ కారు కొనడం, అది చూసి ప్రభావతి నానా హంగామా చేసేయడం, ముగ్గురు అన్నదమ్ములు బీర్ పార్టీ చేసుకోవడం ఇవాళ్టి ఎపిసోడ్ లో చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఆగస్టు 27) ఎపిసోడ్ సంజూకి మీనా వార్నింగ్ ఇవ్వడంతో మొదలవుతుంది. ముందు అతని చెంప పగలగొడుతుంది. నీ గురించి అంతా తెలిసిపోయింది.. పూలు అల్లిన చేతులు అని సుకుమారంగా ఉన్నాయనుకోకు.. ఇటుకలతో తరిమిన చేతులు ఇవి.. నీ గురించి మా ఆయనకు తెలిస్తే నీకు అదే చివరి రోజు అవుతుంది. ఆడపడచు సౌభాగ్యం కోసం ఆలోచించకపోతే నీకు మరో గతి పడుతుంది.. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అంటూ సంజూకి మీనా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

అటు ఇంటికి కారు తీసుకొని వస్తాడు మనోజ్. తల్లి ప్రభావ...