Hyderabad, ఆగస్టు 19 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 491వ ఎపిసోడ్ లో బాలు ఒంటరి వాడైపోతాడు. అతని బార్ వీడియో వైరల్ కావడం, కస్టమర్లు అతని బుకింగ్స్ క్యాన్సిల్ చేయడం, సంజూ ప్రతీకారం, ఇంట్లో మనోజ్, రోహిణి, ప్రభావతి టార్గెట్ చేయడంలాంటి సీన్లతో ఈరోజు ఎపిసోడ్ సాగింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఆగస్టు 19) ఎపిసోడ్ తమ్ముడు శివను మీనా నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ఆ గుణ సావాసంతో చెడిపోతున్నావంటూ తిడుతుంది. కానీ శివ రివర్స్ అవుతాడు. ముందు మీ ఆయన గురించి చూసుకో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూపిస్తాడు. బాలు బార్ లో కూర్చోవడం, తర్వాత గొడవ పడటం, కారు నడపడం అందులో చూస్తుంది. మీ ఆయన నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ మారలేదని శివ అనడంతో మీనా అవమాన భారంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

అటు బాలు కారు నడుపుతుండగా అందులోని కస్టమర్...