Hyderabad, ఆగస్టు 14 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 488వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. బాలుకు ఓ పెద్ద గండం ఉందన్న హింట్ కూడా ఈ ఎపిసోడ్ చివర్లో చూపించారు. మరి ఈ ఎపిసోడ్ లో మొత్తంగా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఆగస్టు 14) ఎపిసోడ్ మనోజ్ ను రోహిణి రూమ్ లోకి తీసుకెళ్లి చితకబాదే సీన్ తో మొదలైంది. డబ్బు నీ అకౌంట్లో పడిందని ఎందుకు చెప్పావంటూ మనోజ్ ను నిలదీస్తుంది. ఏదో డబ్బు వచ్చిందన్న సంతోషంలో అలా చెప్పానని మనోజ్ అంటాడు. ఎవరి ముందు ఎలా ఉన్నా బాలు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తుంది.

తనను తక్కువ అంచనా వేయొద్దని మనోజ్ అంటాడు. డబ్బు ఉంటేనే కదా ఈ సమస్యలన్నీ.. వెంటనే ఖర్చు పెట్టేద్దామని చెబుతాడు. చాలా జాగ్రత్తగా బిజినెస్ మొదలుపెట్టాలి.. లేదంటే మొత్తం మునుగుతాం అని రోహిణి అంటుంది...