Hyderabad, సెప్టెంబర్ 15 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 510వ ఎపిసోడ్ సుశీల రూల్ తో ఇబ్బందిపడే మనోజ్, రోహిణి.. గదిలో బాలు, మీనా రొమాన్స్.. డైనింగ్ టేబుల్ దగ్గర మనోజ్ షాపు ఓపెనింగ్ పై జరిగే రచ్చ.. ఆ తర్వాత ప్రభావతి చేతులు మీదుగా షాపు ఓపెన్ చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది. ఇంకా ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ మనోజ్ ను బాలు రూమ్ లో నుంచి వెళ్లగొట్టే సీన్ తో మొదలవుతుంది. సుశీల పెట్టిన రూల్ ప్రకారం తన గదిని బాలు, మీనాలకు ఇవ్వాల్సి ఉన్నా మనోజ్ ఇవ్వకపోవడంతో అతన్ని బలవంతంగా బయటకు తీసుకొస్తాడు బాలు.

హాల్లో దోమలు, ఏసీ లేదంటూ మనోజ్ సాకులు చెబుతాడు. ప్రభావతి కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. అయితే బాలు, మీనాలకు రవి, శృతి, సత్యం మద్దతుగా నిలవడంతో ఇక చేసేది లేక మనోజ్, రోహిణి హాల్లో పడుకోవడాన...