Hyderabad, ఆగస్టు 22 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఆరెంజ్ జ్యూస్‌లో నేను మందు కలిపాను అని మీనా చెబుతుంది. దాంతో అయ్యబాబోయ్.. నా కోడలు విషం పెట్టేసిందిరోయ్.. నేను బతకను. నేను పోతాను. ఇప్పుడే పోతాను. విషం తాగేశాను అని ప్రభావతి గగ్గోలు పెడుతుంది. మందు అంటే మందే అత్తయ్య. విషం కాదు. నా భర్తకు విషం ఎందుకు పెడతాను అని మీనా అంటుంది.

జ్యూస్‌లో నువ్వెందుకు మందు కలిపావ్ మీనా అని రోహిణి అడుగుతుంది. మా ఆయన మందు మానేయాలని నాటు మందు తీసుకొచ్చి కలిపాను అని మీనా చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మరి అత్తయ్య తాగుతుంటే ఆపకుండా ఎందుకు బయటకు వెళ్లావ్ అని రోహిణి అడిగితే.. ఏమైనా జరుగుతుందేమో అని విరుగుడు మందు తీసుకురాడానికి వెళ్లాను అని మీనా అంటుంది.

మా అమ్మకు ఏదైనా జరిగితే ఏంటీ పరిస్థితి అని మనోజ్ అంటాడు. మీనాను ఎవరు ఏమనొద్దు. మీనా మం...