Hyderabad, సెప్టెంబర్ 17 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 512వ ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి చేసే ఓవరాక్షన్ తో ఇంట్లో వాళ్లందరూ నవ్వుకుంటారు. అయితే ప్రభావతికి మీనా ఎదురు తిరగడం, తొలిసారి నా కోడలు చాలా బాగా మాట్లాడిందంటూ మీనాకు సత్యం మెచ్చుకోవడం మాత్రం ఈ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పొచ్చు.

గుండె నిండా గుడి గంటలు బుధవారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మనోజ్ తన షాపులో పని వాళ్లను తీసేసే సీన్ తో మొదలవుతుంది. మీరు ముసలి వాళ్లు అయిపోయారు.. నాకు యంగ్ బ్లడ్ కావాలంటూ కొత్త వాళ్లను తీసుకొస్తాడు మనోజ్. అది చూసి వాళ్లు బాధపడతారు.

ఓ నెల రోజులు ఆగి తీసేయొచ్చు కదా అని రోహిణి అంటుంది. దాని కంటే ఇప్పుడు తీసేయడమే మేలు.. బిజినెస్ లో అనుభవం ఉన్న వాళ్లను పక్కన పెట్టి పిల్ల బచ్చాలను తీసుకుంటున్నాడు.. నువ్వు అనుభవిస్తావు.. మా ఉసురు తగులుతుంది అని వాళ్లు మనోజ్ ను...