Hyderabad, సెప్టెంబర్ 13 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ మీనా దగ్గరికి వచ్చిన శ్రుతి తమదగ్గర ఉన్న క్యాంపెన్ టెంట్ ఇస్తుంది. ఇదెందుకు, వర్షం కూడా పడే సూచన లేదుగా అని మీనా అంటుంది. వర్షం పడుతుందని కాదు. ఇదివరకు అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు గొడుగు ఎందుకు పట్టుకున్నారు అని శ్రుతి అనగానే మీనా సిగ్గు పడుతుంది.

ఆ సిగ్గు బాలు దగ్గర పడమని టెంట్ ఇచ్చి వెళ్లిపోతుంది శ్రుతి. క్యాంపెన్ టెంట్‌లో బాలు, మీనా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. మొన్న గుడిలో జరిగిందే అసలైన పెళ్లి అని మీనా అంటుంది. అంటే, త్వరలో మరో శోభనం వస్తుందన్నమాట అని బాలు అంటాడు. ఇద్దరు రొమాంటిక్‌గా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం అందరూ పనికి వెళ్తుంటే సత్యం ఆపుతాడు.

తండ్రిగా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. కానీ, మా అమ్మ గుర్తు చేసేవరకు తెలియలేదు. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అని సత్యం ...