భారతదేశం, జూన్ 8 -- Gunde Ninda Gudi Gantalu June 8th Episode: స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఫన్నీగా సాగిపోయింది. రోహిణి కుట్రలు, కుతంత్రాలతో సాగిపోతున్న ఈ సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్ మాత్రం దెయ్యాల చుట్టూ నడిపించారు. మీనా, రోహిణి దెయ్యాలుగా మారడం ఇందులో చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (జూన్ 8) ఎపిసోడ్ విద్య, రోహిణి ఫొటోలను బాలు ఆ తాతకు పంపే సీన్ తో మొదలైంది. అయితే తాత ఊళ్లో లేడని, రెండు రోజుల తర్వాత వస్తాడని మనవడు చెబుతాడు. రాగానే ఆ ఫొటోలు చూయించి వాళ్లు తెలుసా అని అడిగి చూడమని బాలు అతనితో అంటాడు. మరో రెండు రోజులు ఆడాల్సిందే అని మీనాతో చెబుతాడు. అయితే ఇదంతా చేసింది కచ్చితంగా రోహిణియే అని బాలు ఫిక్సవుతాడు.

ఇటు మీనా దెయ్యంలా మారుతుంది. తన దగ్గరికి వచ్చిన రోహిణి గొం...