భారతదేశం, జూలై 1 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చింటు విషయంలో రోహిణికి మరో గండం పొంచి ఉంది. పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లాల్సిన రోహిణికి ఓవైపు సత్యం, మరోవైపు బాలు, మీనా.. ఇంకోవైపు మనోజ్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

సీరియల్ బుధవారం (జులై 1) ఎపిసోడ్ ప్రభావతిని చింతామణి రెచ్చగొట్టే సీన్ తో మొదలువుతుంది. ఛాలెంజ్ లు వద్దు.. ముందు మీ కోడళ్లను కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత బరువు తగ్గే ప్లాన్ చేయండి.. రెండూ చేసినా సరే అని అంటుంది. దీంతో ప్రభావతి మూడు నెలల్లో బరువు తగ్గి చూపిస్తాను అంటూ శపథం చేసి వెళ్తుంది. బయటకు వెళ్లగానే మనోజ్ కు ఫోన్ చేసి ఓ డైటీషియన్ ను చూడమని చెబుతుంది.

అటు స్కూల్లో రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందని, కచ...