భారతదేశం, డిసెంబర్ 16 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 576వ ఎపిసోడ్ లో మొత్తానికి తల్లిదండ్రులను కలపడంలో బాలు సక్సెస్ అవుతాడు. ఇంట్లో అందరినీ కలపడానికి సుశీల వేసిన ప్లాన్ మొత్తానికి వర్కౌటవుతుంది. అయితే చివర్లో మనోజ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాయడం ఈ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలచింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ మనోజ్ కు ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. నేను సంపాదించే డబ్బుతో కూర్చొని తిందామనుకుంటున్నావా అని తల్లిని మనోజ్ అనడంతో ఆమె ఒక్కసారి కంటతడి పెడుతూ ఆవేశ పడుతుంది.

బాలును సవతి తల్లిలాగా చూస్తూ ప్రేమంతా నీ ఒక్కడికే పంచినందుకు తనకు తగిన శాస్తే తగిలిందని అంటుంది. ఒక్కదానొక్క ఆడ పిల్లకు కూడా ఏమీ ఇవ్వకుండా పంపించి అంతా నీకే ఇచ్చినందుకు, లక్షలు తెచ్చి ఇచ్చినందుకు తనకు ఇలా జరగాల్సిందే అని ప్రభావతి...