భారతదేశం, జూన్ 25 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. అది అటు తిరిగి ఇటు తిరిగి రోహిణి మెడకు చుట్టుకునేలా ఉంది. కామాక్షి నగలతో సుందరి ఉడాయించడం, ఆ అబ్బాయి మటన్ కొట్టు మాణిక్యం అల్లుడే కావడం ఇక్కడ అసలు ట్విస్ట్.

బాలు స్టార్ట్ చేసిన డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీనా చెక్కు రాసే సీన్ తో సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రభావతి దెప్పిపొడవడంతో మీనా, శృతి ఆమెకు తమదైన స్టైల్లో గడ్డి పెడతారు. అటు రోహిణి, మనోజ్ లకు కూడా తలంటు పడుతుంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక అందరూ బిక్కమొహాలు వేస్తారు.

రూమ్ లోకి వెళ్లగానే మనోజ్ ను రోహిణికి చితకబాదుతుంది. ఇంటికి తగిలించిన అతని డిగ్రీలు ఉన్న నేమ్ బోర్డుతో కొడుతుంది. ఇన్ని డిగ్రీలు చదివి ఏం లాభం.. ...