భారతదేశం, నవంబర్ 5 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 547వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి, మనోజ్ చేసిన పనికి బాలు, మీనాలకు అవమానం జరుగుతుంది. నకిలీ నగల వల్ల ఇంట్లో మరోసారి రచ్చ జరిగే సూచనలు కనిపించాయి. మనోజ్, ప్రభావతిలను కడిగి పారేయడానికి బాలు సిద్ధం కాగా.. మీనా అతన్ని రెండు రోజులు ఆగమని నియంత్రిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు బుధవారం (నవంబర్ 5) ఎపిసోడ్ ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా ప్రభావతిని మీనా నగల గురించి సత్యం అడిగే సీన్ తో మొదలవుతుంది. దీంతో మనోజ్, ప్రభావతి కంగారు పడతారు. వాళ్లిద్దరినీ చూసి బాలులో అనుమానం మొదలవుతుంది.

అయినా శపథం చేసిన తర్వాత ఇప్పుడా నగలు ఎందుకు అని మనోజ్, ప్రభావతి, రోహిణి అడుగుతారు. కానీ శృతితోపాటు సత్యం కూడా మీనా, బాలుకు మద్దతుగా నిలుస్తారు. అది మీకు అనవసరం.. మీనా నగలు ఆమెకు ఇచ్చేయమని సత్యం గట్టిగా చెబు...