Hyderabad, జూలై 23 -- స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు బుధవారం (జులై 23) 472వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సాగింది. ఈ సీరియల్ ను కీలక మలుపు తిప్పే సీన్లు ఇవాళ్టి ఎపిసోడ్లో జరిగాయి. రవి, శృతి తిరిగి ఇంటికి రావడం, ఇంట్లో కేక్ కటింగ్ అన్నది ఎంతో ఆసక్తి రేపింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఇంటికి బిచ్చగాడి రూపంలో వచ్చిన మనోజ్ ను చూసి ప్రభావతి, రోహిణి షాక్ తినడంతో మొదలవుతుంది. తన భర్తను బిచ్చగాడనుకొని బయటకు వెళ్లగొట్టాలని చూసిన రోహిణికి తర్వాత అతడు మనోజ్ అని తెలుస్తుంది. ఎందుకిలా చేశావంటూ అతన్ని నిలదీస్తుంది. దీంతో ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని అంటాడు. ఇంట్లో అడుక్కుంటే కాలేదని, బయట అడుక్కుంటావా అంటూ బాలు సెటైర్ వేస్తాడు.

ఆ సమయంలో పక్కనే ఉన్న మీనా అసలు ...