Hyderabad, అక్టోబర్ 7 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 526వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా ఆత్మహత్య చేసుకుందన్న భయం నుంచి ఆమె తిరిగి ఇంటికి క్షేమంగా రావడం వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. బాలు ఆమెను చూసి కొట్టబోయి హత్తుకోవడం ఈ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ గదిలో మీనా ఏదైనా లెటర్ వదిలి వెళ్లిందేమో అని ప్రభావతి, శృతి, రోహిణి, కామాక్షి వెతికే సీన్ తో మొదలవుతుంది. ఇంతలో ఓ లెటర్ దొరకడం, అందులో తన అత్త వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఆమె ఓ గయ్యాలి అత్త అని మీనా రాసి ఉండటం, అది విని ప్రభావతి పోలీస్ స్టేషన్ లో సీన్ ఊహించుకోవడం, అక్కడ తనకు ఉరిశిక్ష వేసినట్లుగా ఊహించి భయపడుతుంది. ఇంతలో కామాక్షి ఆమెను తట్టిలేపి అప్పుడే ఉరికంబం వరకూ వెళ్లిపోయావా అని అడుగుతుంది. తీరా ఆ లెటర్ తాన...