భారతదేశం, డిసెంబర్ 11 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 573వ ఎపిసోడ్ ప్రభావతిని ముఖం మీదే చెడామడా తిట్టేస్తుంది శృతి. మీనాకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తుంది. దీంతో ఆమె గురించి కామాక్షికి చెప్పి బాధపడుతుంది. అటు సుశీల ఎంట్రీ ఇచ్చి ప్రభావతికి క్లాస్ పీకుతుంది. ఇంత జరిగినా ఆమె మాత్రం వెనక్కి తగ్గదు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 11) ఎపిసోడ్ ముగ్గురు కోడళ్లు కలిసి మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. అత్తయ్య, మామయ్యలను ఎలాగైనా కలపాలని మీనా అంటుంది. తప్పంతా ఆంటీదే అని, మనోజ్ కు సపోర్ట్ చేయడం ఏంటని శృతి అంటుంది. ఇంట్లో అందరూ బాగుండాలని మీనా అంటే..

మరి మనోజ్‌తో బాలు బాగుండాలని ఎందుకు చెప్పవు అని రోహిణి అడుగుతుంది. అలా అయితే రోహిణి నగలను తీసుకెళ్లి బాలును అమ్ముకోమని చెప్పు మీనా.. అప్పుడు రోహిణి వచ్చి బాలుతో బాగుం...