భారతదేశం, జూన్ 4 -- Gunde Ninda Gudi Gantalu June 4th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ డ్రామా 'గుండె నిండా గుడి గంటలు' రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతూ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠకు కొనసాగింపుగా.. గురువారం (జూన్ 4) కథనంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బాలు, మీనాలకు ఎదురైన కష్టాలు, మరోవైపు రోహిణి అబద్ధాలు, మనోజ్ ఓవరాక్షన్ చుట్టూ నేటి ఎపిసోడ్ నడిచింది.

గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ మొదట్లోనే రోహిణి తండ్రి ఫోటో బాలు కంట పడుతుంది. ఆ ఫోటోను చూడగానే బాలుకు ఎక్కడో చిన్న అనుమానం మొదలవుతుంది. రోహిణి చెప్తున్నట్లుగా ఆమె తండ్రి కోట్లు సంపాదించిన వ్యక్తిలా ఆ ముఖం కనిపించకపోవడంతో బాలు తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు.

"ఇది కోట్లు సంపాదించిన ముఖమేనా? అసలు మలేషియా ముఖమేనా?" అంటూ బాలు డైరె...