Hyderabad, ఆగస్టు 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో బాలుపై నింద పోగొట్టడానికి బార్‌కి వెళ్తుంది మీనా. అక్కడ నిలబడి ఉన్న మీనాను ఓ యూట్యూబర్ వీడియో తీస్తూ తాగడానికి వచ్చిందటూ ప్రచారం చేస్తాడు. ఆ యూట్యూబర్‌ను కొట్టి తరిమేస్తుంది మీనా.

బార్ ఓపెన్ చేశాక వెళ్లి ఓనర్‌తో మాట్లాడుతుంది మీనా. బాలుకు జరిగింది అంతా ఓనర్‌కు చెబుతుంది మీనా. ఇప్పుడు నేనేం చేయగలనమ్మా అని ఓనర్ అంటే.. ఇక్కడ ఏం జరిగిందో మీ సీసీటీవీలో తెలుస్తుంది కదా. ఆరోజు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మా ఆయన నిజంగా తాగాడా లేదా అనేది తెలుస్తుందని మీనా అంటుంది.

దాంతో సీసీటీవీ రూమ్‌ చూపించి వర్కర్‌కు మీనా అడిగిన రోజు ఫుటేజ్ చూపించని చెబుతాడు బార్ ఓనర్. డేట్ చెప్పి మీనా సీసీటీవీ చూస్తుంది. అందులో బాలు తాగకుండా కేవలం పెగ్ కలపడం, పొలిటిషియిన్ చికెన్ తినిమంటే తినడం, దాన...