Hyderabad, అక్టోబర్ 11 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కామాక్షి ఇంట్లో ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తుంది. ప్రభావతి నాట్య భంగిమలతో రూమ్ అంతా నిండిపోతుంది. ముందు శ్రుతిని జ్యోతి ప్రజ్వలన చేయమంటుంది ప్రభావతి. దానికి రోహిణి అసూయ పడుతుంది.

డ్యాన్స్ స్కూల్ ఐడియా నేనిస్తే శ్రుతితో జ్యోతి ప్రజ్వలన చేయిస్తుంది. ఇంత పక్షపాతం ఉండకూడదు అని మనోజ్‌తో రోహిణి అంటుంది. తర్వాత రోహిణితో జ్యోతి ప్రజ్వలన చేయిస్తుంది. మీనాను కూడా పిలవమని కామాక్షి అంటే.. రెండే ఒత్తులున్నాయని ప్రభావతి అంటుంది.

దాంతో బాలు కోప్పడతాడు. నూనే, దీపాలు అన్ని నేనే రెడీ చేశాగా ఇదంతా అవసరం లేదులెండి అని మీనా అంటుంది. ఆస్తులున్న ఇద్దరు కోడళ్లతో వెలిగించి నా భార్యను మాత్రం తక్కువ చేస్తావా. అయితే రిబ్బన్ కటింగ్ మీనాతో చేయించాలని బాలు డిమాండ్ ...