Hyderabad, జూన్ 21 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో హల్వా, మల్లెపూలు తీసుకొచ్చి మీనాతో ఫస్ట్ నైట్ చేసుకొందామని బాలు అనుకుంటాడు. కానీ, హాల్లోకి ఎవరో ఒకరు ఏదో ఒక కారణంతో రావడంతో బాలు మీనాలకు డిస్టర్బెన్స్ అవుతుంది. అంతేకాకుండా హల్వాను మనోజ్ రోహిణి తినేసి వెళ్లిపోతారు.

తిన్న బిర్యానీ అరగక అవస్థతో ప్రభావతి హాల్లోకి వస్తుంది. అప్పుడే మూడ్‌లోకి వచ్చిన బాలు ప్రభావతి విజిల్ కొట్టుకుంటూ రావడంతో ఆగిపోతాడు. ఇక హాల్లో ప్రభావతి నడుస్తూ ఉంటుంది. దాంతో మొత్తానికి బాలు మీనా ఫస్ట్ నైట్ ప్లాన్ చెడిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ప్రభావతి ఇంటికి శ్రుతి తల్లి శోభన వస్తుంది.

ఇంటికి వచ్చి శ్రుతికి నల్లపూసల కార్యక్రమం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. శ్రుతికి పెళ్లి అయి ఇంతకాలం అయినా మీరైన నల్ల పూసలు గుచ్చి పుస్తెలతాడు వేయలేదు. ఆ నల్ల...