భారతదేశం, డిసెంబర్ 15 -- తెలుగులో మరో వెరైటీ లవ్ స్టోరీ రాబోతోంది. ఈ సినిమా పేరు పతంగ్ (Patang). అందరూ కొత్త నటీనటులతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 15) రిలీజ్ కాగా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తి రేపేలా సాగింది. ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. మధ్యలో ఓ అమ్మాయి.. ఆమె కోసం ఆ ఇద్దరూ శత్రువులుగా మారి కొట్టుకోవడం. ఈ స్టోరీ కొత్తదేమీ కాదు. కానీ దీనికి పతంగుల కాంపిటిషన్ ను జోడించి వెరైటీగా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని తీసుకొస్తున్నాడు డైరెక్టర్ ప్రణీత్ ప్రత్తిపాటి. ఒకే అమ్మాయి కోసం పోటీ పడే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ల మధ్య ఆ అమ్మాయి కోసం సాగే పతంగుల పోటీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలపనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెరైటీ కాన్సెప్ట్ తో ...