భారతదేశం, జనవరి 20 -- పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. అయితే మనకు ఉన్న 18 మహాపురాణాల్లో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందట. గరుడ పురాణం పారాయణం చేస్తే ఆత్మకు శాంతి కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. గరుడ పురాణాన్ని విష్ణువు తన వాహనమైన గరుడుడికి చెప్పాడు. కనుక గరుడ పురాణం అనే పేరు వచ్చింది.

జీవిత సత్యాలను, మరణం తర్వాత రహస్యాలను తెలుసుకోవడానికి గరుడ పురాణాన్ని చదువుతారు. గరుడ పురాణాన్ని చదివేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించి, ఏకాగ్రతతో చదవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలి.

గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. ప్రతి...