భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలని, ఎలాంటి ప్రతికూల శక్తి దరిచేరకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఎన్నో రకాల పూజలు, నోములు, పరిహారాలు చేస్తుంటాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు అనుకున్న ఫలితం దక్కదు. అలాంటి సమయాల్లో మన గ్రంథాలు చూపించిన మార్గాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మహాపురాణాలలో ఒకైన 'గరుడ పురాణం' కేవలం మరణం గురించే కాకుండా, సంతోషకరమైన, పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా గడపాలో వివరిస్తుంది.

ఈ పవిత్ర గ్రంథంలో మన చుట్టూ ఉండే కొన్ని ప్రత్యేకమైన పవిత్ర వస్తువులను లేదా జీవులను కేవలం స్పర్శించడం వల్ల జీవితంలోని సకల నష్టాలు, నెగెటివ్ ఎనర్జీ దూరమై అదృష్టం ఎలా వరిస్తుందో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఐదు పవిత్ర విషయాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్ గృహలక్ష్మ...