భారతదేశం, ఆగస్టు 25 -- జీవిత ప్రయాణంలో తప్పులు జరగడం చాలా సహజం. కొన్నిసార్లు అనుకోకుండా తీసుకునే నిర్ణయాలు, మరికొన్నిసార్లు నోటి నుంచి వచ్చిన మాటలు ఇతరుల మనసును గాయపరుస్తుంటాయి. కాలం గడిచిపోయినా ఆ సంఘటనలు మనసును వెంటాడుతూనే ఉంటాయి. "అలా చేసి ఉండకూడదు" అనే ఆలోచన నిద్రలేకుండా చేస్తుంది. అయితే గతాన్ని మార్చలేమని తెలిసినా, ఆ జ్ఞాపకాల బరువుతో నేటి జీవితాన్ని నష్టపోవడం సమంజసం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీమద్భగవద్గీత) మనకు అందించే దిశానిర్దేశం ఏమిటంటే, జరిగిన పొరపాటులో కూరుకుపోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే అసలైన జీవన మార్గం.

మనసులో తప్పు చేశామనే భావన కలగడం సాధారణమైన విషయమే. ఇది మనం తప్పును గుర్తించడానికి ఒక సంకేతంగా పనిచేస్తుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలామంది ఆ తప్పును అంగీకరించి సరిదిద్దుకునే బదులు తమన...