భారతదేశం, జనవరి 25 -- 2026 జనవరి 26న దేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

దేశవ్యాప్తంగా పౌరులు గర్వంగా, గౌరవంగా ఈ జాతీయ సెలవుదినాన్ని జరుపుకుంటున్న వేళ.. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న కర్తవ్య పథ్‌లో జరిగే ఐకానిక్ పరేడ్‌తో వేడుకలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తారు.

ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు రిపబ్లిక్​ డే పరేడ్‌ను చూడటానికి దేశ రాజధానికి చేరుకుంటారు. ఒకవేళ మీరు దిల్లీ వెళ్లలేకపోయినా, ఇంట్...