భారతదేశం, మే 24 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (APTA), ప్రముఖ రైడ్-హేలింగ్ సంస్థ రాపిడో' సంయుక్తంగా డ్రైవర్-కమ్-గైడ్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆటో, బైక్ డ్రైవర్లను సర్టిఫైడ్ టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దనున్నారు.

వైజాగ్ లోని APTDC యాత్రి నివాస్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉండే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో మొదటి విడతగా 1,000 మందికి పైగా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కేవలం విశాఖపట్నం నుంచే తొలి దశలో 350 మంది డ్రైవర్లను ఎంపిక చేసి...