భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలోని వినోబా నవోదయ కాలనీలోని భూదాన్ భూమిలో నిర్మించిన ఇళ్లను కూల్చివేయడంపై వివిధ రాజకీయ పార్టీల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. అక్కడ పేదల పూరిళ్లు, రేకుల షెడ్ల కూల్చివేత కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూమి కేటాయింపులు అధికారికంగా లేవని అధికారులు చెబుతున్నారు. అయితే బహిష్కరించబడిన కుటుంబాలు తమ భవిష్యత్తు గురించి అయోమయంలో ఉన్నాయి.

వెయ్యి మందికి పైగా పోలీసులు, విపత్తు సహాయ దళ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి భారీ సంఖ్యలో మట్టి తరలింపు వాహనాలు, ట్రాక్టర్ ట్రాలీలు, మినీ ట్రక్కులు ఈ ఇళ్ల తొలగింపు ఆపరేషన్‌లో పాల్గొని దాదాపు 350కిపైగా ఇళ్లను తొలగించాయి. ప్రతిఘటిస్తే అదుపులోకి తీసుకుని తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ముందే హెచ్చరించారు.

ఖమ్మ...