భారతదేశం, నవంబర్ 4 -- ఖమ్మం జిల్లాలో వరద నీటిలో చిక్కుకుపోయిన మత్స్యకారుల ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన రక్షణ సిబ్బంది ఊహించని ప్రమాదంలో పడ్డారు. సహాయక చర్యలు చేస్తుండగా.. రెండు బోట్లు పల్టీ కొట్టాయి. దీంతో 11 మంది ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పరిధిలోని బేతుపల్లి పెద్ద చెరువు వద్ద జరిగింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల కురుస్తున్నాయి. మరోవైపు బేతుపల్లి పెద్ద చెరువులోకి వరద నీరు భారీగా ప్రవాహించింది. ఈ క్రమంలో అలుగు పారడంతో చెరువులోని చేపలు కొట్టుకుపోకుండా నిరోధించేందుకు ఐదుగురు జాలర్లు చెరువు వద్దకు వెళ్లి వలలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. వర్షపు నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు మత్స్యకారులు వరద నీటి సుడిగుండంలో చిక్కుకుపోయారు.

మత్స్యకారులు చిక్కుకున్న ...