భారతదేశం, మార్చి 11 -- ఖమ్మంలోని వెలుగుమట్ల వినోభా నగర్ కాలనీలో నిర్వాసితులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు, మంజూరు పత్రాలను అందజేయనున్నారు. వినోభా నవోదయ భూదాన్ కాలనీ నుండి ఎంపిక చేసిన లబ్ధిదారులకు అధికారులు టోకెన్ల పంపిణీని ప్రారంభించారు. అయితే నిర్వాసిత కుటుంబాలకు ఇంటి స్థలాలను ఎక్కడ కేటాయించాలనే దానిపై అధికారులు గోప్యత పాటించారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని సంప్రదించగా.. భూమి ఎక్కడ ఉందో తరువాత మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. ఖమ్మం శివార్లలోని తొమ్మిది ఎకరాల భూమిలో ఎంపిక చేసిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 75 చదరపు గజాల ఇ...