భారతదేశం, నవంబర్ 21 -- కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో క్షీరాబ్ది ద్వాదశి చాలా ముఖ్యమైనది. ప్రతి ఏటా శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటారు. ఈరోజు వచ్చిన ద్వాదశి చాలా విశేషమైనది. ఈ రోజు చాలా మంది తులసి కల్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. అలాగే తులసి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారు. ప్రదక్షిణాలు చేస్తారు. తులసమ్మకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు భక్తిగా చేయండి. అలాగే ఈ పాట పాడుతూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ పాటను ఆలపిస్తే సంపద, సౌభాగ్యం కూడా కలుగుతాయి.

గోపు ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా

గోవింద సన్నిధి నాకియ్యవమ్మా

ఒంటి ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా

వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా

రెండో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా

నిండైన సంపదలు నాకియ్యవమ్మా

మూడో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా

ముత్తైదవత...