Hyderabad, జూలై 13 -- టాలీవుడ్ యంగ్ హీరో రవి కిరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గదాధారి హనుమాన్. తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో అత్యంత భారీ సినిమాగా తెరకెక్కిన గదాధారి హనుమాన్‌కు రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించారు.

తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన గదాధారి హనుమాన్ టీజర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గదాధారి హనుమాన్ టీజర్ లాంచ్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో రవి కిరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో రవి కిరణ్ మాట్లాడుతూ .. "మా కోసం వచ్చిన రాజ్ కందుకూరి సముద్ర, కళ్యాణ్ గారికి థాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా న...