భారతదేశం, ఆగస్టు 22 -- సైన్స్, టెక్నాలజీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కోసం ఒకప్పుడు కృషి చేసిన సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెంజర్​ జారా దార్.. ఇప్పుడు, తన పీహెచ్‌డీని వదిలి OnlyFans మోడల్‌గా మారింది. అంతేకాదు, వ్యూస్​ విషయంలో ఈమె చేసిన ఒక 'ఎక్స్​పరిమెంట్​'లో షాకింగ్​ విషయాలు బయటపడ్డాయి. సాధారణ దుస్తులతో పోల్చితే, 'ట్యాంక్​ టాప్​' వేసుకున్న వీడియోకి ఎక్కువ వ్యూస్​ లభించాయి! దీనిని ఆమె 'ట్యాంక్​-టాప్​ ఎఫెక్ట్​' అని పిలుస్తోంది.

జారా దార్ 'ట్యాంక్-టాప్ ఎఫెక్ట్' అని పిలిచే ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. దీని ఫలితాలు ఆన్‌లైన్ అల్గారిథమ్‌ గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి.

ప్రయోగ వివరాలు, ఫలితాలు:

ఏ/బీ టెస్ట్: ఇటీవల జారా దార్ తన పరిశీలనలను ఒక పోస్ట్‌లో పంచుకుంది. ఆమె ఒకే రకమైన షార్ట్​ వీడియోలను రెండు రూపొందించింది. వీటి మధ్య ఉన్న ఏకైక తేడా ఆమ...