భారతదేశం, జూలై 26 -- దేశంలో పర్సనల్​ లోన్​ పొందడానికి, వాటిపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి అధిక క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. మీరు కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటున్నారా? లేదా గతంలో ఎటువంటి రుణాలు తీసుకోని వారైతే, సంప్రదాయ బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) సులభ నిబంధనలతో మీకు నిధులు ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చు.

అయితే, దీని అర్థం మీకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లు కాదు! క్రెడిట్ స్కోరు లేకపోయినా వ్యక్తిగత రుణాలు పొందడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ జర్నీని ఇప్పుడే మొదలుపెట్టిన వారికి వ్యక్తిగత రుణాలకు ప్రత్యామ్నాయంగా ఐదు తెలివైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

1. ఎల్​ఐసీ పాలసీపై రుణం:

ఎల్​ఐసీ వంటి జీవిత బీమా పాలసీలకు సరెండర్ విలువ ఉంటే, వాటిని క్విక్​ పర్సనల్​ లోన్​ పొందడానికి పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్...