భారతదేశం, ఆగస్టు 13 -- ప్రస్తుత ఆర్థిక ప్రపంచంలో మంచి క్రెడిట్ స్కోర్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు! అది ఎన్నో ఆర్థిక అవకాశాలకు డోర్లు తెరిచే తాళం లాంటిది! కానీ ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు లేకపోతే మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవడం సాధ్యమేనా? కచ్చితంగా సాధ్యమే. క్రెడిట్ కార్డు ఉపయోగించకుండానే మీ క్రెడిట్ స్కోర్​ని పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము..

ఏం చేయాలో తెలుసుకునే ముందు, క్రెడిట్ స్కోర్​ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం..

సమయానికి చెల్లింపులు: ఇది అత్యంత ముఖ్యమైన అంశం. మీ రుణాలు, ఈఎంఐలను సకాలంలో చెల్లించడం మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది.

క్రెడిట్ వినియోగం: మీరు ఎంత క్రెడిట్‌ను ఉపయోగించుకుంటున్నారు? మీకు ఎంత అందుబాటులో ఉంది? అనే నిష్పత్తి ఇది. తక్కువగా ఉంటే మంచిది.

క్రెడిట్ హ...