భారతదేశం, జూలై 31 -- తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రియాక్టయ్యాడు. విజయ్ సేతుపతి తన స్నేహితురాలిని వాడుకున్నాడంటూ ఓ అమ్మాయి ఎక్స్ లో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది. వెంటనే పోస్టు డిలీట్ చేసిన అది చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజయ్ సేతుపతి స్పందించాడు. ఆ ఆరోపణలను ఖండించాడు.

డెక్కన్ క్రానికల్ నుంచి సుభాష్ కె ఝాతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి ఈ ఆరోపణలను ఖండించాడు. "నా గురించి కొంచెం తెలిసినవాళ్లు ఎవరైనా దీనిని చూసి నవ్వుతారు. నాకు నేను తెలుసు. ఇలాంటి అసభ్యకరమైన ఆరోపణలు నన్ను కలవరపెట్టలేవు. నా కుటుంబం, సన్నిహిత స్నేహితులు బాధపడుతున్నారు. కానీ నేను వారికి 'దీన్ని వదిలేయండి. ఈ మహిళ కావాలని ఇలా చేస్తోంది. ఆమెకు కొన్ని నిమిషాల ఫేమ్ కావాలి, ఆనందించనివ్వండి' అని చెప్పా" అని విజయ్ తెలిపాడు.

క్యాస్టింగ్ కౌచ్ ఆరోప...