భారతదేశం, జూలై 7 -- దాదాపు 24 సంవత్సరాలుగా దోపిడీలు, హత్యలు చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ అజయ్ లాంబా ఎట్టకేలకు దొరికాడు! దిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పోలీసులు గాలిస్తున్న లాంబాపై నాలుగు దోపిడీ-హత్య కేసులు ఉన్నాయి.

అజయ్​ లాంబా నేరాలకు పాల్పడే పద్ధతి చాలా సులభంగా ఉంటుంది. ఉత్తరాఖండ్‌కు వెళ్లడానికి టాక్సీని అద్దెకు తీసుకుంటాడు. ఆ తర్వాత డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి, హత్య చేస్తాడు. మృతదేహాన్ని పారవేసి, కారును అక్రమంగా నేపాల్ సరిహద్దు దాటించి విక్రయిస్తాడు. కానీ ఎప్పుడూ దొరకలేదు!

ఈ నేరాలకు పాల్పడేటప్పుడు అతను ఒంటరిగా ఉండేవాడు కాదు! అతనికి సహాయం చేసే సహచరులు కూడా ఉన్నారు. 2001 ప్రాంతంలో దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలోని పలువురు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని నే...