భారతదేశం, నవంబర్ 5 -- ఓటీటీలోకి మరో తమిళ మూవీ దూసుకొచ్చేసింది. ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. దేవుడిగా తనను తాను ప్రకటించుకున్న ఓ దొంగ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన 'కంబి కట్న కథై' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి బాబాగా దొంగ ఎందుకు మారాల్సి వచ్చింది, దాని వెనుకు ఉన్న కారణం ఏంటీ అన్నదే తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఓటీటీలోకి తమిళ రీసెంట్ కామెడీ సస్పెన్స్ మూవీ కంబి కట్న కథై వచ్చేసింది. ఈ సినిమా మంగళవారం నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడీ తమిళ సినిమాను రెంట్ విధానంలో మాత్రమే చూడొచ్చు. అంటే మూవీకి డబ్బులు చెల్లించి చూసే అవకాశమే ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉంది.

కంబి కట్న కథై మూవీ కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనా...