Hyderabad, జూన్ 29 -- ఓటీటీ వేదికలు అయిన జీ5, ఈటీవీ విన్ మధ్య ఎవరిది ఒరిజినల్ కంటెంట్ అనే గొడవ నడుస్తోంది. రీసెంట్‌గా జూన్ 27 నుంచి జీ5లో తెలుగు హారర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, విరాటపాలెం ట్రైలర్ చూసిన కానిస్టేబుల్ కనకం మేకర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమ స్టోరీని కాపీ కొట్టి విరాటపాలెం తెరకెక్కించారని కానిస్టేబుల్ కనకం దర్శకనిర్మాతలు ఆరోపించారు. దీనిపై కోర్టులో కూడా కేసు వేసినట్లుగా చెప్పారు. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ సిరీస్‌గా కానిస్టేబుల్ కనకం రూపొందుతోంది. విరాటపాలెం ట్రైలర్ వచ్చిన కొన్ని రోజులకే తమదే ఒరిజినల్ గన్ అంటూ కానిస్టేబుల్ కనకం పోస్టర్‌ను రిలీజ్ చేసింది ఈటీవీ విన్ ఓటీటీ.

ఇక జూన్ 27న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయి సక్సెస్ అయినట్లుగా శనివారం (జూన్ 28)...