భారతదేశం, డిసెంబర్ 25 -- టాలీవుడ్‌లో మీడియా ముందు కూడా ఓపెన్ గా మాట్లాడే ప్రొడ్యూసర్లలో నాగవంశీ కూడా ఒకరు. అతడు నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి అవేంటో చూడండి.

ఇంటర్వ్యూ మొదట్లోనే నాగవంశీ ఈ ఏడాది త్వరగా వెళ్లిపోతే బాగుండు అన్నట్లుగా మాట్లాడాడు. ఎందుకు అని అడిగితే.. తాను కొన్ని నిర్ణయాలను బలిసి తీసుకున్నానని, అవన్నీ మిస్ ఫైర్ అయ్యాయని చెప్పాడు.

"ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అందుకే ఈ ఫేజ్ త్వరగా వెళ్లిపోతే బాగుండు అనిపిస్తోంది. కొన్ని కొన్ని నిర్ణయాలు బలిసి తీసుకున్నాను. అవన్నీ మిస్ ఫైర్ అయ్యాయి. ఎప్పుడైనా అంతే కదా దేవుడు వీడికి ఎక్కువైందో గాల్లో ఉన్నాడు కింద పడేస్తే కానీ తెలియదంటారు కదా.. కొన్ని నెత్తికెక్కి నిర్ణయాలు తీసుకున్...