భారతదేశం, డిసెంబర్ 27 -- కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకునే వారికి రెనో ఇండియా షాకిచ్చింది. తన పోర్ట్‌ఫోలియోలోని పాపులర్ మోడల్స్ అయిన క్విడ్, ట్రైబర్, కైగర్ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జనవరి 2026 నుంచి ఈ పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.

ముడిసరుకు ఖర్చులు (Input costs) పెరగడం, మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని రెనో వెల్లడించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా 2 శాతం వరకు ఉండవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, అన్ని వేరియంట్లపై ఒకే రకమైన పెంపు ఉండదు, కచ్చితమైన కొత్త ధరల జాబితాను జనవరిలో విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో రెనో మూడు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వాటి ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇక్కడ చూడండి:

రెనో క్విడ్ (Kwid): బ్రాం...