భారతదేశం, సెప్టెంబర్ 16 -- తమిళ స్టార్ హీరో ధనుష్ రాబోయే చిత్రం 'ఇడ్లీ కడై'. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ లో కొడుకు లింగాతో కలిసి ధనుష్ డ్యాన్స్ చేయడం వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇడ్లీ కడై ఆడియో లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో కలిసి ధనుష్ పర్ఫార్మ్ చేస్తున్నాడు. అప్పుడే అతని కొడుకు లింగా స్టేజీపైకి వచ్చాడు. ధనుష్, లింగా కలిసి డ్యాన్స్ చేశారు. ఈ చిత్రంలోని 'ఎంజమీ తంధానే' పాటకు ఇద్దరు కాళ్లు కదిపారు. తండ్రిని మ్యాచ్ చేస్తూ లింగా డ్యాన్స్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. డ్యాన్స్ ముగిశాక లింగాను ధనుష్ హగ్ చేసుకున్నాడు. అతను గౌరవ చిహ్నంగా తన తండ్రి పాదాలను తాకాడు.

ఓ వైపు యాక్టర్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న ధనుష్ డైరెక్టర్ గానూ తన...