భారతదేశం, జనవరి 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను తీసుకు వస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభ ఫలితాలు ఎదురైతే, ఇంకోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరో ఐదు రోజులు అంటే జనవరి 25న కేతువు నక్షత్ర సంచారంలో మార్పు జరగబోతోంది. కేతువు జనవరి 25న పూర్వఫాల్గుణి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

కేతువు నక్షత్ర సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో కెరీర్, రిలేషన్‌షిప్, మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది.

సింహ రాశి వారికి కేతువు సంచారంతో శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటారు. ...